మోహన్ లాల్‌ నటవిశ్వరూపం..ఒడియన్‌

219
mohan lal odian
- Advertisement -

జనతా గ్యారేజ్, మన్యంపులి, కనుపాప, మనమంతా చిత్రాలతో తెలుగు ప్రజలకు బాగా దగ్గరైన హీరో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. తెలుగులో మంచి మార్కెట్‌ను పెంచుకున్న మోహన్‌లాల్ మరోసారి ఒడియన్‌గా ప్రేక్షకుల ముందుకురానున్నాడు. తెలుగు, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగు పోస్టర్‌‌ను స్టార్ దర్శకుడు వి వి వినాయక్ చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ సినిమా కోసం మోహన్ లాల్ తెగ కష్టపడుతున్నాడు. 55 సంవత్సరాల వ్యక్తిగా 30 ఏళ్ల యువకుడిగా విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. ఇందుకోసం యెగా, వ్యాయామాలు చేసి త‌న వ‌య‌సుని 55 సంవ‌త్స‌రాల నుండి 30 సంవ‌త్స‌రాలు కనిపించేలా శరీరాన్ని మార్చుకొని న‌టించారు.

ఈ ఫస్ట్ లుక్‌లో మోహన్ లాల్ గెటప్ ఆశ్చర్య పరిచేదిగా ఉంది. మోహన్‌ లాల్‌ లుక్ కిరాక్‌గా ఉందంటూ ప్రశంసిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు విఎ కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు,మలయాళంలో డిసెంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకురానుంది.

- Advertisement -