సెప్టెంబర్‌లో చిన్నారులకు అందుబాటులోకి వ్యాక్సిన్!

98
randeep
- Advertisement -

కరోనా మహమ్మారికి చెక్ పెట్టాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కాగా దేశవ్యాప్తంగా యుద్ద ప్రాతిపదికన వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా.. చిన్నారులకు మాత్రం ఇంకా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాలేదు.

దీనిపై శరవేగంగా ట్రయల్స్ జరుగుతుండగా చిన్నారులకు వ్యాక్సిన్‌పై స్పందించారు ఎయిమ్స్‌ చీఫ్ రణదీప్ గులేరియా. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ నాటికి చిన్నారులకు కూడా కోవాగ్జిన్‌ అందుబాటులోకి వ‌స్తుంద‌ని తెలిపారు.

రెండేళ్లు పైబడిన చిన్నారులకు ఆ వ్యాక్సిన్‌ వేసుకోవచ్చని….. ఇప్పటికే పిల్లల‌పై కోవాగ్జిన్‌ చేప‌ట్టిన‌ రెండు, మూడో ద‌శ ట్రయల్స్‌కు సంబంధించిన డేటా సెప్టెంబ‌ర్‌లో అందుబాటులోకి వ‌స్తుంద‌ని వెల్లడించారు. ఫైజ‌ర్, బ‌యోఎన్‌టెక్ వ్యాక్సిన్‌కు భార‌త్‌లో అనుమతి ఇస్తే అవి కూడా పిల్లలకు అందించే అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు.

- Advertisement -