దేశంలో కొత్తగా 41,157 క‌రోనా కేసులు న‌మోదు..

112
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసులు మళ్లీ కొన్ని పెరిగాయి. దేశంలో గత 24 గంటల్లో 41,157 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,10,64,908కు చేరింది. అలాగే, నిన్న 42,004 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 518 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,13,609కు పెరిగింది.

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,02,69,796 మంది కోలుకున్నారు. 4,22,660 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 40,49,31,715 వ్యాక్సిన్ డోసులు వేశారు. కరోనా పాజిటివిటీ రేటు 2.13 శాతంగా ఉండగా, రికవరీ రేటు 97.31 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -