దేశంలో కొత్తగా 38,628 క‌రోనా కేసులు..

59
corona

దేశంలో కరోనా కేసులు కొద్దిగా తగ్గినట్టు కనిపిస్తున్నాయి.. దేశంలో గత 24 గంటల్లో 38,628 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, 24 గంట‌ల్లో 40,017 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,95,385కు చేరింది. గత 24 గంటల్లో 617 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,27,371కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,10,55,861 మంది కోలుకున్నారు.

కాగా,4,12,153 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. నిన్న 49,55,138 వ్యాక్సిన్ డోసులు వేయగా, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 50,10,09,609 వ్యాక్సిన్ డోసులు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు. కరోనా పాజిటివిటీ రేటు 2.21 శాతంగా తెలిపింది. గత 12 రోజులుగా ఇది 3 శాతం లోపే ఉంటుందని పేర్కొన్నది.