మోహ‌న్ బాబు ఇంట్లో మోహన్ లాల్ సంద‌డి..

77

మలయాళం సూపర్‌ స్టార్‌ మోహన్ లాల్, టాలీవుడ్‌ డైలాగ్‌ కింగ్‌ మోహన్ బాబుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరూ నట దిగ్గజాలే. ఒకరు మలయాళ చిత్రసీమను ఏలుతుంటే, మరొకరు టాలీవుడ్‌లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఇక వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం మరోసారి వెల్లడైంది. తాజాగా మోహన్ లాల్ హైదరాబాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా మోహన్ బాబు ఇంట్లో ఆయనకు విందు ఏర్పాటు చేశారు. మోహన్ బాబు కుటుంబంతో మోహన్ లాల్ సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

ఫొటోల‌లో మోహన్ లాల్ తో పాటు మోహన్ బాబు ఆయన భార్య, విష్ణు ఆయన భార్య అలాగే మంచు లక్ష్మి ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇద్దరు Mలు ఒక లెజెండ్రీ డిన్నర్ కోసం కలుసుకున్నారని చెబుతూ మంచు ల‌క్ష్మీ ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మోహన్ బాబు, మోహన్ లాల్ మధ్య ఎంతటి సరదా సన్నివేశాలు చోటు చేసుకున్నాయో ఈ ఫొటోల ద్వారా అర్థమవుతోంది.