దేశంలో కొత్త‌గా 3,23,144 మందికి కరోనా..

189
covid

భారత్‌లో ప్రపంచ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత ఐదు రోజులుగా మూడు లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు, రెండువేలకుపైగా మరణాలు రికార్డవుతుండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దేశంలో నిన్న‌ ఒక్కరోజే కొత్త‌గా 3,23,144 మందికి కరోనా నిర్ధారణ అయింది. 2,51,827 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,76,36,307 కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 2,771 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,97,894కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,45,56,209 మంది కోలుకున్నారు. 28,82,204 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 14,52,71,186 మందికి వ్యాక్సిన్లు వేశారు.