దేశంలో కొత్త‌గా 18,711 మందికి కరోనా..

53
corona

దేశంలో మళ్ళీ కరోనా మహమ్మారి తిరగబడుతోంది. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం..దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 18,711 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే సమయంలో 14,392 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,12,10,799కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 100 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,57,756 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,08,68,520 మంది కోలుకున్నారు. 1,84,523 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 2,09,22,344 మందికి వ్యాక్సిన్ వేశారు.