కామన్‌ వెల్త్‌ క్రీడల్లో భారత్‌ బోణీ….

141
sanket
- Advertisement -
కామన్‌ వెల్త్‌ క్రీడల్లో భారత్‌ బోణీ కొట్టింది. బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత్‌ సత్తా చాటుతుంది. క్రీడలు ప్రారంభమైన రెండో రోజు రజత పతకంతో భారత్‌ ఖాతా తెరిచింది. మహారాష్ట్రకు చెందిన 21 ఏళ్ల వెయిట్ లిఫ్టర్ సంకేత్ మహదేవ్ సర్గర్ సాధించిపెట్టారు. 55 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఆయన రజత పతకం (సిల్వర్ మెడల్) కైవసం చేసుకున్నారు. ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆయన రెండు రౌండ్లలో మొత్తం 248 కేజీల (113 కేజీలు + 135 కేజీలు) బరువును ఎత్తి రజత పతకం సాధించారు.
- Advertisement -