BB10:ఈవారం ఎలిమినేషన్‌లో వీరే

0
- Advertisement -

బిగ్ బాస్ హౌస్‌లో 17వ రోజు నామినేషన్ల పర్వం అత్యంత ఉద్రిక్తంగా, వివాదాస్పదంగా ముగిసింది. “ఏది జరిగినా మంచికే అంటారు” అన్నట్టుగా, సుధీర్ రెడ్డి విషయంలో సృష్టి, త్రిగుణ్‌లు కలసి చేసిన వ్యవహారం చివరికి సుధీర్‌కే సానుభూతిని, గౌరవాన్ని తెచ్చిపెట్టింది. కేవలం ‘ఫ్రీడమ్’ అనే ఒక్క మాటను పట్టుకుని సుధీర్‌ను తీవ్రంగా బ్లేమ్ చేయడమే కాకుండా చెత్తను అతని మొహంపై కొట్టి ఘోరంగా అవమానించారు. బిగ్ బాస్ చరిత్రలోనే ఇలాంటి సంఘటన జరగలేదని వీక్షకులు మండిపడుతున్నారు.

ఈ నామినేషన్స్ గొడవలో త్రిగుణ్ పాత్రపై హౌస్‌లో తీవ్ర చర్చ నడిచింది. రోహిత్, ముకేష్‌లు త్రిగుణ్ ప్రవర్తనను ‘శకుని గేమ్‌’తో పోల్చారు. వంశీని ఎలాగైతే తన ఆట కోసం వాడుకున్నాడో, ఇప్పుడు సృష్టిని కూడా అలాగే అస్త్రంగా వాడుతూ రెచ్చగొడుతున్నాడని వారు అభిప్రాయపడ్డారు. మొదటి వారం నుంచే త్రిగుణ్ అందరినీ తీవ్రంగా అవమానిస్తున్నాడని రోహిత్ ఆవేదన వ్యక్తం చేశాడు. రాం ప్రసాద్, నరేష్, దేబ్జానీలు కూడా సృష్టి, త్రిగుణ్‌ల ప్రవర్తనను తప్పుపట్టారు. సృష్టి హద్దులు దాటి “పళ్లు రాలగొడతా” అని హెచ్చరించడం సరైంది కాదని, నామినేషన్ ఛాన్స్ వస్తే సుధీర్‌కు మద్దతుగా నిలవాలని రాం ప్రసాద్ సూచించాడు.

నామినేషన్ ప్రక్రియ ముగింపునకు వచ్చేసరికి అసలు రచ్చ మొదలైంది. వర్షిణి, షాలినిల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గేమ్స్ సరిగా ఆడలేదని, సంచాలక్‌గా విఫలమయ్యావని షాలిని విమర్శించగా, ఇద్దరి మధ్య మాటల యుద్ధం సాగింది. ఆ తర్వాత షాలిని ఇచ్చిన అవకాశంతో సృష్టి, సుధీర్‌ను నామినేట్ చేసింది. తన అవసరం కోసం వాడుకున్నావంటూ సృష్టి ఓవరాక్షన్ చేయగా, సుధీర్ ఎంతో ఓపికగా సమాధానమిచ్చాడు. “నేను ఎప్పుడూ నీ వెంటపడలేదు, నా గేమ్‌పై ఫోకస్ పెట్టడానికే ఫ్రీడమ్ అని అన్నాను” అని స్పష్టం చేసినా సృష్టి వినలేదు.

చివరికి పిచ్చెక్కినట్టు ప్రవర్తించిన సృష్టి, సుధీర్ ముఖంపై చెత్తను కుమ్మరించింది. ఆ సమయంలో త్రిగుణ్ చప్పట్లు కొడుతూ వికృత ఆనందం పొందడం అందరినీ నివ్వెరపరిచింది. అయితే సుధీర్ మాత్రం ఎంతో హుందాగా, “జీవితంలో దుమ్ము, ధూళి పడుతుంటాయి, స్నానం చేస్తే పోతాయి” అంటూ ఎంతో సమ్యమనంతో బదులిచ్చాడు. ఈ ఉదంతంతో సుధీర్ ఇమేజ్ ఆడియన్స్‌లో మరింత పెరిగింది.

ముగింపులో ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న వారి వివరాలను బిగ్ బాస్ ప్రకటించారు.

ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న సభ్యులు:

సుధీర్

వంశీ

త్రిగుణ్

షాలిని

వర్షిణి

అమన్

ఝాన్సీ

చరణ్

మొత్తంగా ఎనిమిది మంది ఈ వారం ఎలిమినేషన్ ముంగిట నిలిచారు.

Also Read:చాలా డిఫరెంట్‌గా ‘ది ప్యారడైజ్’

- Advertisement -