వన్డేల్లో నం-1 స్థానాన్ని కోల్పోయిన టీమిండియా…

249
India Lossed Number-1 Positions In ICC ODI rankings
- Advertisement -

వన్డేల్లో భారత్ కు నిరాశే ఎదురైంది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ తో కోహ్లీ సేన అగ్రస్థానాన్ని కోల్పోయింది. టెస్టుల్లో మాత్రం మొదటి స్థానంలో కొనసాగుతుంది. టీ20ల్లో మూడోస్థానంతో సరిపెట్టుకుంది. వన్డే 2015-16, 2016-17 సీజన్లు మాత్రమే పరిగణలోకి తీసుకుని ఐసీసీ ర్యాంకులను ప్రకటించింది.

new-zealand-v-england-5th-odi_4cf682d8-4de3-11e8-a9dc-143d85bacf22

వన్డేలో నిన్నటి వరకు 123 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న టీమ్ ఇండియా ఒక పాయింట్ కోల్పోయి రెండవ స్థానంలోకి దిగజారింది. మరోవైపు 8 పాయింట్లు మెరుగు పరుచుకుని ఇంగ్లండ్ 125 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా(113), న్యూజిలాండ్‌ (112), ఆస్ట్రేలియా (104), పాకిస్థాన్‌(102), బంగ్లాదేశ్‌ (93), శ్రీలంక(77), వెస్టిండీస్‌ ‌(69), అఫ్గానిస్థాన్‌ (63) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మరోవైపు టీ20ల్లో మాత్రం ఎలాంటి మార్పు జరగలేదు. 123 పాయింట్లతో భారత్ మూడో స్థానంలో కొనసాగుతుండగా, 130 పాయింట్లతో పాకిస్థాన్ మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఆస్ట్రేలియా (126) రెండవ స్థానంలో ఉంది. న్యూజిలాండ్‌ (116), ఇంగ్లాండ్‌ (115), దక్షిణాఫ్రికా(114), వెస్టిండీస్‌(114) ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.

- Advertisement -