భార‌త జ‌ట్టుకు ప్రధాని మోదీ శుభాకాంక్ష‌లు..

44
modi

భారత్ చివరి టెస్ట్‌లో గెలిచి 2-1తో బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. 32 ఏళ్లుగా ఓట‌మెరుగ‌ని బ్రిస్బేన్‌లో కంగారూల ప‌ని ప‌ట్టింది. ఈ చ‌రిత్రాత్మ‌క విజ‌యంపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. భారత్‌ విజయంపై తాజాగా ప్ర‌ధాని మోదీ స్పందించారు. భార‌త జ‌ట్టు విజ‌యానికి దేశ‌మంతా గ‌ర్విస్తోంద‌ని మోదీ ప్ర‌శంసించారు.. ఆట‌గాళ్లు త‌మ అభిరుచి, అద్భుత‌శ‌క్తిని ప్ర‌ద‌ర్శించారు అని మోదీ కొనియాడారు. భార‌త జ‌ట్టుకు మోదీ శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు.

అలాగే మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ సచిన్ టెండూల్క‌ర్‌ టీమిండియాను కొనియాడారు. గ్రేటెస్ట్ సిరీస్ విజ‌యాల్లో ఇదీ ఒక‌ట‌ని మాస్ట‌ర్ అభిప్రాయ‌ప‌డ్డాడు. ఈ సిరీస్‌లో ప్ర‌తి సెష‌న్‌కు ఓ హీరో దొరికాడ‌ని మాస్ట‌ర్ అన్నాడు. దెబ్బ త‌గిలిన ప్ర‌తిసారీ బ‌లంగా నిల‌బ‌డ్డాం. భ‌యం లేని క్రికెట్ ఆడాం. గాయాలే, అనిశ్చితులు ఆత్మ‌విశ్వాసాన్నే పెంపొందించాయి. ఇది గ్రేటెస్ట్ సిరీస్ విజ‌యాల్లో ఒక‌టి. కంగ్రాట్స్ ఇండియా అని స‌చిన్ ట్వీట్ చేశాడు.