18వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. నేటి నుండే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలు ఏపీ,ఒడిశా,అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా ఎన్నికలకు పూర్తి స్ధాయిలో సన్నద్ధమై ఉన్నామని చెప్పారు రాజీవ్ కుమార్. జూన్ 16లోగా ఎన్నికల గడువు ముగుస్తుందని అంతలోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఎన్నికల నిర్వహణపై అన్ని రాష్ట్రాల్లో సమావేశాలు నిర్వహించామని చెప్పారు. దేశంలో మొత్తం 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని 10 లక్షలకు పైగా పోలింగ్ కేంద్రాలు,55 లక్షలకు పైగా ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. భారత్ లాంటి పెద్ద దేశంలో ఎన్నికల నిర్వహణ సవాల్‌తో కూడుకుందన్నారు.
.ఈసారి ఎన్నికల్లో మహిళల భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పురుషుల కంటే 1.8 కోట్ల మంది మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు.
Also Read:వైసీపీ ఎంపీ అభ్యర్థులు వీరే….