ప్చ్.. హీరో లుక్ కోసం కష్టాలు

18
- Advertisement -

రామ్ చరణ్ – దర్శకుడు బుచ్చిబాబు కలయికలో సినిమా అనగానే.. అందరిలో ఎన్నో రకాల ఆలోచనలు. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ బాగా ఫీల్ అయ్యారు. ఓ చిన్న దర్శకుడికి చరణ్ ఎందుకు డేట్స్ ఇస్తున్నాడు ?, తన మార్కెట్ ను తానే ఎందుకు తగ్గించుకుంటున్నాడు ? అంటూ ఇలా ఎన్నో భయాలు. వీటన్నిటి మధ్యలో బుచ్చిబాబు, చరణ్ తో సినిమా పూర్తి చేయడానికి కసరత్తులు చేస్తున్నాడు. బుచ్చిబాబు ఈ సినిమా స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి చేశాడు.

మరోవైపు చరణ్ ఫిట్ నెస్ కోసం తెగ వర్కౌట్స్ చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ లుక్ కోసం బుచ్చిబాబు ఏకంగా నెలరోజులు కేటాయించారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకూ ఏ దర్శకుడు చూపించని విధంగా రామ్ చరణ్ ను తాను చూపించాలి అని బుచ్చిబాబు ఆశ పడుతున్నాడు. అందుకే ప్రస్తుతం చరణ్ లుక్ కోసం ఏకంగా 200 గెటప్స్ ను స్కెచ్ వేయించి.. వాటికి ఏఐ టూల్స్ తో మెరుగులు దిగ్గుతూ సరికొత్త లుక్ కోసం తీవ్రంగా కష్టపడుతున్నాడట.

చరణ్ లుక్ కోసం బుచ్చిబాబు కష్టాల న్యూస్ సోషల్ మీడియాలో చూడగానే నెటిజెన్స్ సరదాగా.. పాపం బుచ్చిబాబు, చరణ్ లుక్ కోసం తెగ కష్టపడుతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ, చరణ్ లుక్ కోసం స్కెచ్ ఆర్టిస్టుల‌తో వేయించిన గెట‌ప్పుల్లో చరణ్ ఎలా ఉంటాడో, కెమెరా ముందు రామ్ చరణ్ లుక్స్ కి సంబంధించి స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండ‌బోతోందో, ఏ లుక్ చరణ్ కి సెట్ అవుతుందో చూడాలి.

Also Read:కవిత అరెస్ట్ వెనకుంది బీజేపీనే!

- Advertisement -