అవినీతి భారతం…మనమే టాప్

236
India is the most corrupt country in Asia
- Advertisement -

భారతదేశం ఎంత అభివద్ధి చెందుతుందో ఏమోగాని అవినీతిలో మాత్రం దూసుకుపోతోంది. 16 ఆసియా పసిఫిక్‌ దేశాల్లో అవినీతిలో భారతదేశమే అగ్రస్థానంలో ఉందని ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌’ అంతర్జాతీయ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది. వివిధ అంశాలపై నిర్వహించిన సర్వేలో ఈ అంశం వెల్లడైంది.

ఈ మేరకు ఓ జాబితా విడుదల చేసిన ఫోర్భ్స్‌ భారత్ అవినీతిలో వియాత్నం,థాయ్ లాండ్, పాకిస్ధాన్, మయన్మార్ దాటేసింది. అవినీతిలో 69 శాతంతో భారత్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో  తమ పనికోసం లంచం చెల్లించామని ప్రజలు వెల్లడించారు.  స్కూళ్లు, హాస్పిట‌ళ్లు, ఐడీ డాక్యుమెంట్లు, పోలీసులు, సేవ‌ల రంగాల్లో లంచం మ‌రీ ఎక్కువ‌గా ఉన్న‌ట్లు  రిపోర్ట్ స్ప‌ష్టంచేసింది.

అయితే, అవినీతిలో భారత్ ప్రధమ స్ధానంలో ఉన్న మోడీ మాత్రం బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. 53 శాతం మంది మోడీ పనితీరు బాగుందని అవినీతి నిర్మూలన,నిజాయితీతో పనిచేస్తున్నారని తమ అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. అవినీతిని రూపుమాపాల‌ని మోడీ ప్ర‌భుత్వం చేస్తున్న ల‌క్ష్యాల‌ను అందుకోవాలంటే భారత్ ఇంకా చాలా ముందుకు వెళ్లాల్సి ఉంద‌ని ఆ నివేదిక పేర్కొన్న‌ది.

వియాత్నంలో  65 శాతం అవినీతి ఉండగా పాక్ 40 శాతం అవినీతితో తర్వాతి స్ధానంలో నిలిచింది.  భారత్, చైనా సహా మొత్తం 16 ఆసియా పసిఫిక్‌ దేశాల్లో ప్రభుత్వ అధికారులకు 90కోట్ల మంది లంచాలు ఇచ్చారు. అంటే, ప్రతి నలుగురిలో ఒకరు లంచం ఇచ్చే పనులు చేయించుకున్నారు. ఈ 16 దేశాల నుంచి 22వేల మంది ప్రజల అభిప్రాయాలను సేకరించడం ద్వారా ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సర్వే చేసింది.

అవినీతిని నిర్మూలించేందుకు తమ ప్రభుత్వాలు మంచి చర్యలు తీసుకుంటున్నాయని భారత్, శ్రీలంక, థాయ్‌లాండ్, ఇండోనేసియా దేశాల ప్రజలు అభిప్రాయపడ్డారు. దక్షిణ కొరియా, హాంకాంగ్, మలేసియా, జపాన్‌ దేశాల ప్రజలు ఇందుకు భిన్నంగా అభిప్రాయపడ్డారు

- Advertisement -