- Advertisement -
ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్‌కు భారత ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది. భారత యూజర్ల ప్రైవసీని గౌరవించాలని తేల్చి చెప్పిన కేంద్రం… వెంటనే కొత్త ప్రైవసీ పాలసీని ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు వాట్సాప్ సీఈవో విల్ కాత్‌కార్ట్‌కు లేఖ రాసింది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ . మా కొత్త పాలసీని అంగీకరించండి లేదంటే వాట్సాప్‌ను వదులుకోండి అన్న వాట్సాప్ సందేశాన్ని ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది.
వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు ఇండియాలో చాలా మంది యూజర్లు ఉన్నారని, ఇప్పుడీ రెండింటి యూజర్ల డేటాను సేకరిస్తే అది దేశంలోని చాలా మంది పౌరుల ప్రైవసీకి భంగం కలిగించినట్టు అవుతుందని లేఖలో పేర్కొంది.
- Advertisement -