చారిత్రక విజయం..ఆస్వాదించండి: కోహ్లి

66
kohli

ఆసీస్ గడ్డపై భారత్ అపూర్వ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రహానే సేనపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతుండగా తాజాగా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. అడిలైడ్ టెస్ట్ త‌ర్వాత మా సామ‌ర్థ్యాన్ని అనుమానించిన వాళ్లంతా ఒక్క‌సారి ఈ విజ‌యాన్ని చూడండి అంటూ పేర్కొన్నాడు విరాట్.

మా సామ‌ర్థ్యాన్ని శంకించిన వాళ్లంతా ఒక్క‌సారి ఈ విజ‌యాన్ని చూడండి. అత్య‌ద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌. ప్లేయ‌ర్స్ చూపించిన తెగువ‌, సంక‌ల్ప బ‌లం నిజంగా అద్భుతం. ఈ చారిత్ర‌క విజయాన్ని ఆస్వాదించండి అంటూ కోహ్లి ప్ర‌శంస‌లు కురిపించాడు.