భారత్‌లో మరో కొత్తరకం కరోనా వేరియంట్ కలకలం రేపుతోంది.ఇటీవల బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్తరకం ఎక్స్ఈ వేరియంట్ భారత్‌లోనూ వెలుగుచూసింది. తొలి కేసు ముంబైలో నమోదైనట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. ఈ కొత్త రకం వెలుగు చూసిన బాధితుల్లో తీవ్ర లక్షణాలేవీ లేవని పేర్కొంది.
ముంబైకి చెందిన 230 మంది బాధితుల నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించారు. వీటిలో 228 మందిలో ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయింది. ఒకరిలో కప్పా, మరొకరిలో ఎక్స్ఈ బయటపడింది.
ఒమిక్రాన్ ఉప రకాలైన బీఏ.1, బీఏ.2ల మిశ్రమం ఉత్పరివర్తనంగా భావిస్తోన్న ఈ వేరియంట్… అధిక సాంక్రమికశక్తి కలిగివున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. భారత్‌లోకి ప్రవేశించడంతో మరోసారి అప్రమత్తం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
లక్షణాలు..
జర్వం, గొంతు గరగర, గొంతుమంట, దగ్గు, జలుబు, దురద, అజీర్తి.