భారత్, యూరోపియన్ యూనియన్ (EU) కలిసి ప్రపంచ జీడీపీలో 25 శాతం వాటాను కవర్ చేసే ‘భారీ ఒప్పందం’పై సంతకాలు చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇండియా–EU వాణిజ్య ఒప్పందంపై లైవ్ అప్‌డేట్స్ ప్రకారం, ఆర్థిక అభివృద్ధి, నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థ, స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడంలో భారత్, యూరోపియన్ యూనియన్ సన్నిహిత భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. ఈ సంబంధంలో వాణిజ్యం, పెట్టుబడులు కీలక స్థంభాలుగా ఉన్నాయి.
మంగళవారం (జనవరి 27) జరుగుతున్న 16వ ఇండియా–EU సమ్మిట్‌లో, ఇరు పక్షాలు “అన్ని ఒప్పందాలకు తల్లి”గా వర్ణించబడుతున్న కీలక ఒప్పందాన్ని ప్రకటించనున్నాయి. ఇది ఎన్నో సంవత్సరాలుగా సాగిన చర్చలకు విజయవంతమైన ముగింపుగా నిలిచింది. ఈ సమ్మిట్‌కు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో లూయిస్ సాంటోస్ ద కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ సంయుక్తంగా అధ్యక్షత వహిస్తున్నారు. భారత్, EU కలిపి ప్రపంచ వాణిజ్యంలో దాదాపు ఐదవ వంతు, ప్రపంచ జనాభాలో సుమారు 25 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇది ఈ భాగస్వామ్యానికి ఉన్న ఆర్థిక, వ్యూహాత్మక ప్రాధాన్యతను చూపిస్తోంది.
ప్రధాని మోదీ మాట్లాడుతూ…నిన్న యూరోపియన్ యూనియన్, భారత్ మధ్య ఒక పెద్ద ఒప్పందం కుదిరింది. దీనిని ప్రజలు ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా పిలుస్తున్నారు. ఈ ఒప్పందం భారత్, యూరప్ ప్రజలకు భారీ అవకాశాలను తెస్తుంది. ఇది ప్రపంచంలోని రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య భాగస్వామ్యానికి అద్భుత ఉదాహరణ. ఈ ఒప్పందం ప్రపంచ జీడీపీలో 25 శాతం, ప్రపంచ వాణిజ్యంలో మూడో వంతును ప్రతినిధ్యం వహిస్తుంది అన్నారు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, భారత్–EU మధ్య టెక్నాలజీ, రక్షణ భాగస్వామ్య ఒప్పందం కుదరడం సంక్లిష్టమైన ప్రపంచ పరిస్థితుల్లో ఇరు పక్షాలను మరింత దగ్గర చేసేదిగా ఉందన్నారు. భారత 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా EU ప్రతినిధుల పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, బహుళత్వం, ఫెడరలిజం, చట్ట పాలన వంటి పంచుకున్న విలువలే భారత్–EU భాగస్వామ్యానికి పునాదిగా ఉన్నాయని, ప్రపంచ భద్రత, స్థిరమైన వృద్ధి, సమగ్ర సమృద్ధి కోసం కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.
Also Read:గ్రీన్ ఛాలెంజ్‌లో అశ్విని రాజ్‌కుమార్

