మద్రాస్ హైకోర్టులో సినీ నటుడు విజయ్కు ఎదురుదెబ్బ తగిలింది. #JanaNayagan సినిమా వివాదానికి సంబంధించి గతంలో ఇచ్చిన సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ఇంతకుముందు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ, చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వాల్సిందేనని సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది.
సింగిల్ బెంచ్ ఉత్తర్వుల్లో చట్టపరమైన లోపాలున్నాయని, సెన్సార్ బోర్డ్ అధికార పరిధిలోకి న్యాయస్థానం జోక్యం చేసుకోవడం సరికాదని CBFC వాదించింది. ఈ వాదనలను పరిశీలించిన డివిజన్ బెంచ్, సెన్సార్ ప్రక్రియలో బోర్డ్‌కు ఉన్న స్వతంత్రతను గుర్తు చేస్తూ, సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసింది.
Also Read:VD14:రణబాలిగా విజయ్
డివిజన్ బెంచ్ ఉత్తర్వులతో #JanaNayagan సినిమా భవితవ్యం మళ్లీ అనిశ్చితిలో పడింది. ఇకపై సెన్సార్ బోర్డ్ నిర్ణయమే తుది అని స్పష్టమవడంతో, ఈ అంశం సినీ పరిశ్రమలో, అభిమానుల్లో విస్తృత చర్చకు దారితీసింది.

