ఆసియా కప్ ఫైనల్లో భారత్‌

45
- Advertisement -

ఆసియా కప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది భారత్. శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో విజయం సాధించింది భారత్. 214 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 41.3 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ని కట్టడి చేయడంలో భారత బౌలర్లు సక్సెస్ అయ్యారు. దునిత్‌ (42 నాటౌట్‌, ధనంజయ డిసిల్వా (41) రాణించగా పాథుమ్‌ నిషాంక (6), దిముత్‌ కరుణరత్నె (2), కుషాల్‌ మెండిస్‌ (15), సమరవిక్రమ (17), అసలంక (22), కెప్టెన్‌ షనక (9) విఫలమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 4, జడేజా, బుమ్రా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

ఇక అంతకముందు తొలతు బ్యాటింగ్ చేసిన భారత్ 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (53; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) , కేఎల్‌ రాహుల్‌ (39) రాణించారు. లంక బౌలర్లలో దునిత్‌ వెల్లలాగె 5, చరిత అసలెంక 4 వికెట్లు పడగొట్టారు. దునిత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’అవార్డు దక్కింది. సూపర్‌-4 దశలో భాగంగా శుక్రవారం జరుగనున్న నామమాత్రమైన పోరులో బంగ్లాదేశ్‌తో భారత్‌ తలపడనుంది. శ్రీలంక, పాకిస్థాన్‌ మధ్య గురువారం జరుగనున్న మ్యాచ్‌ విజేతతో భారత్‌ తుదిపోరులో తలపడనుంది.

Also Read;ఆహాలో ‘మాయా పేటిక’

- Advertisement -