- Advertisement -
ప్రస్తుత కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లో జాత్యంహకార సంఘటనలు సర్వసాధారణమవుతున్నాయి. తాజాగా భారత్ ఇంగ్లాడ్ జట్ల మధ్య జరుగుతోన్న టెస్టు మ్యాచ్ వేదిక ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలోనూ ఇలాంటి ఆరోపణలే ఎదురయ్యాయి. జాత్యంహకార సంఘటన తలెత్తడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇటువంటి విషయాలను ఉపేక్షించకూడదంటున్నారు పలువురు సీనియర్ క్రికెటర్లు, ఎనలిస్టులు.
భారత అభిమానుల పట్ల పలువురు జాత్యంహకర వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో స్పందించింది. “టెస్టు మ్యాచ్ సందర్భంగా జాత్యంహకార వేధింపులకు సంబంధించి నివేదికను పరిశీలించి చర్యలు తీసుకుంటాం. సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతాం. క్రికెట్‌లో వీటికి చోటు లేదు” అని ట్విట్టర్ ద్వారా పేర్కోంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు.
- Advertisement -