ఎందరో మహానీయుల త్యాగ ఫలితంగా దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. దశాబ్దాల బ్రిటిష్ పాలనలో ఎంతో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన భారత్ వెనుకబాటుకు గురైంది. దేశాన్ని సర్వం దోచుకున్న తెల్లవాళ్లు…మనల్ని చీకటిలో పడేశారు. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత్‌ను అభివృద్ధి చేసేందుకు ఎంతో శ్రమించారు. ఆర్ధిక సంస్కరణలు, దేశంలోనే అత్యున్నతమైన రాజ్యాంగం రచన చేసి మంచి ఫలితాలను సాధించారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని స్వేచ్ఛ సమానత్వపు హక్కులను పొందుతున్నారంటే అది మేధావులు చేసిన కృషే.
ఇక భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తి కావొస్తుంది. ఈ ఏడు దశాబ్దాల్లో భారత్ ఎంతో ప్రగతిని సాధించింది. విద్యా, శాస్త్ర, సాంకేతిక, వ్యవసాయం, పారిశ్రామిక, వైద్యం, మౌలిక వసతుల కల్పన, రక్షణ, సేవలు, పరిపాలన, ఇలా అన్ని రంగాల్లో ఎనలేని అభివృద్ధి సాధించింది.
() 1967 సంవత్సరంలో హరిత విప్లవాన్ని తీసుకువచ్చారు. దేశంలో ఆహార కొరత చాలా ఉండటంతో ఆహార ధాన్యాల దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే నాటి ప్రభుత్వాలు హరిత విప్లవాన్ని తీసుకురాగా ఇవాళ భారత్ స్వయం సమృద్ధి గల దేశంగా అవతరించింది. బియ్యం, గోధుమలు, చెరకు, పప్పు ధాన్యాల ఉత్పత్తిలో, ఎగుమతిలో అగ్రగామిగా నిలిచింది.
()ఇక దేశ అభివృద్ధిలో మరో ప్రధానమైంది రవాణా రంగం. రోడ్డు సదుపాయాలతో పాటు, రైల్వే లైన్లు, విమానయానం, నౌకాయానం ఇలా అన్నింటిలోనూ ప్రపంచ స్ధాయి ప్రమాణాలతో నిర్మాణం చేయగా ఫలితంగా పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. దేశంలో ఎక్కడి నుండి ఎక్కడైనా గంటల్లోనే ప్రయాణం చేసే వెసులుబాటు వచ్చింది.
()స్వాతంత్య్రానంతరం భారతదేశం తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసింది. 1954లో, భారతదేశం అటామిక్ ఎనర్జీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. అలా చేసిన మొదటి దేశంగా భారత్ అవతరించింది. 1974లో భారతదేశం తన మొదటి అణు పరీక్ష నిర్వహించి.. ఐదు అణుశక్తి దేశాల జాబితాలో చోటు సంపాదించుకుంది. భారతదేశం ప్రపంచంలో 2వ అతిపెద్ద సైనిక శక్తిని కలిగి ఉంది.
()లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు భారతదేశం ప్రగతిశీల చర్యలు చేపట్టింది. వరకట్న నిషేధ చట్టం-1961, గృహ హింస చట్టం-2005, సాంఘిక దురాచారాల నిర్మూలన వంటి కార్యక్రమాలు చేపట్టింది. బేటీ బచావో బేటీ పఢావో వంటి అనేక ప్రభుత్వ కార్యక్రమాలు దేశంలో లింగ వివక్షను తొలగించడంలో కీలక పాత్ర పోషించాయి.
Also Read:భారత్ – విండీస్ నాలుగో టీ20..
()భారతదేశ అభివృద్ధిలో విద్య కీలక పాత్ర పోషించింది. విద్యా హక్కు చట్టం ద్వారా అందరికీ ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యను అందిస్తున్నారు. విద్యను పొందడం ప్రతి ఒక్కరి హక్కుగా ఈ చట్టం పేర్కొనగా మనదేశానికి చెందిన ఎంతోమంది ఇవాళ ప్రపంచదేశాల్లో రాణిస్తున్నారు. అంతేగాదు పలు అంతర్జాతీయ కంపెనీలకు సీఈవోలుగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
()వైద్య సేవల్లో ప్రపంచమే అశ్చర్యపోయే స్థాయికి భారత్ చేరింది. భారత్‌కు చెందిన అనేక మెడిసిన్ కంపెనీలు ప్రపంచ దేశాల్లో సేవలు అందిస్తున్నాయి. కొన్ని వ్యాధులకు ఇండియాలోనే మెడిసిన్ కనిపెట్టారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులను దేశం సమర్ధవంతంగా ఎదుర్కొంది.
()ఆర్థిక పరమైన అంశాల్లో భారత్ శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది. ప్రపంచంలో టాప్ 4 ఆర్థిక శక్తిగా ఇండియా నిలిచింది. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ దినదినాభివృద్ధి చెందుతోంది. డిజిటల్ పేమెంట్స్ రావడంతో క్యాష్ లెష్ లావాదేవీలు పెరిగిపోయాయి. అంతేకాదు సాంకేతిక రంగంలో, పారిశ్రామికంగా, క్రీడా రంగంలో, సినిమా రంగంలో, అందాల పోటీల్లో, సేవల రంగంలో చరిత్రను తిరగ రాస్తోంది భారత్.
Also Read:KTR:భూదాన్ పోచంపల్లికి మంత్రి కేటీఆర్..