Rajinikanth:యుఎస్‌లో తగ్గని ‘జైలర్‌’

29
- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘జైలర్‌’. నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ గ్రాండ్ గా విడుదల చేశాయి. ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

వరల్డ్ వైడ్ భారీ వసూళ్లతో రికార్డు ఓపెనింగ్స్ సాధించగా మరి రెండో రోజు కూడా క్రేజీ నంబర్స్ ని ఈ చిత్రం సెట్ చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక యూఎస్ లో జైలర్ హవా కొనసాగుతోంది. ఇప్పటికే 2 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసిన ఈ చిత్రం లేటెస్ట్ గా 2.25 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటింది.

Also Read:టి కాంగ్రెస్ వారిద్దరినే నమ్ముకుందా?

ఇక వీకెండ్ రావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అనిరుద్ సంగీతం అందించగా సన్ పిక్చర్స్ నిర్మించింది.

Also Read:వయానాడ్‌కు రాహుల్ గాంధీ

- Advertisement -