చైనా మళ్లీ కవ్వింపు చర్యలు..

240
china helicopters
- Advertisement -

భారత- చైనా మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఓ వైపు చర్చలు జరుగుతుండగానే ఇరు దేశాలు సరిహద్దుల వెంబడి భారీగా సైనికులకు మొహరిస్తున్నాయి. ఇక మరోవైపు చైనా కవ్వింపు చర్యలను కొనసాగిస్తూనే ఉంది. వాస్తవాదీన రేఖ వెంబడీ హెలికాప్టర్లతో హల్ చల్ చేస్తోంది చైనా.

దీంతో పాటు పాంగాంగ్‌లో కొత్తగా హెలీప్యాడ్ నిర్మాణం చేపట్టింది చైనా. ఇదిఇలా ఉండగా చైనా నుండి వచ్చే భారత సరుకుల నౌకలకు ఇబ్బంది కలిగిస్తున్నారు చైనా,హాంకాంగ్ కస్టమ్స్ అధికారులు. చైనా గుడారాలు వేసిన ప్రాంతం భారత సైనిక దళాలకు అత్యంత కీలకమని తెలుస్తోంది.

చైనా ఒంటరి అవుతోందని మాజీ డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ సుబ్రతా సాహా అభిప్రాయపడ్డారు. చైనా దూకుడును ఇరుగుపొరుగు దేశాలపై భారీ మిలటరీ దాడిగా అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు టెడ్‌ యోహో అభివర్ణించారు

- Advertisement -