వాస్తవాధీన రెఖ వెంబడి వెనక్కి తగ్గిన చైనా…

47
india china

భారత్ – చైనా సరిహద్దుల మధ్య జరుగుతున్న ఉద్రిక్తలకు బ్రేక్ పడింది. లడక్‌ సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వెంబడి కీలక ప్రాంతాల నుండి చైనా పూర్తిగా వెనక్కి తగ్గింది. గల్వాన్ లోయలోని పెట్రోలింగ్ పాయింట్ 14 వద్ద ఉన్న శిబిరాలను పూర్తిగాను, ఫింగర్ 4, పాంగాంగ్ త్సో ప్రాంతాల్లోని శిబిరాలను పాక్షికంగాను చైనా తొలగించింది.

జూన్ 30న ఇరు దేశాల సైనిక అధికారుల మధ్య జరిగిన చర్చల్లో భాగంగా గాల్వన్ నది ప్రాంతం పరిధిలోని వాస్తవాధీనరేఖకు ఇరువైపులా మూడు కిలోమీటర్ల మేర బఫర్ జోన్‌గా ఉంచాలని నిర్ణయించారు. దీంతో ఆ మేరకు ఇరు దేశాలు తమ సైన్యాన్ని వెనక్కి మళ్లిస్తున్నాయి.

ఇరుదేశాల మధ్య శాంతిని పునరుద్ధరించేందుకు సరిహద్దుల వద్ద నుంచి వీలైనంత తొందరగా ఆర్మీని వెనక్కిమళ్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇరు దేశాల సైనిక బలగాలను వాస్తవాధీన రేఖ నుంచి మూడు కిలోమీటర్ల అవతలకు మళ్లిస్తున్నారు.