శనివారం ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మహిళా జట్టు భారీ విజయం సాధించింది. న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 155 పరుగుల భారీ తేడాతో విండీస్‌పై గెలుపొందింది. 318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 162 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో మిథాలీ సేన వరల్డ్ కప్ టోర్నిలో మరో విజయం అందుకుంది. దీంతో ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండింటిలో గెలిచి మరో మ్యాచ్ లో ఓడిన భారత్ 4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
భారత్: యస్తికా భాటియా, స్మృతి మంధాన, దీప్తి శర్మ, మిథాలీ రాజ్(కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్(వికెట్ కీపర్), స్నేహ్ రాణా, పూజా వస్త్రాకర్, ఝులన్ గోస్వామి, మేఘనా సింగ్, రాజేశ్వరీ గైక్వాడ్
వెస్టిండీస్: డియేండ్ర డాటిన్, హేలీ మాథ్యూస్, కైసియా నైట్(వికెట్ కీపర్), స్టెఫానీ టేలర్(కెప్టెన్), షిమానె కాంప్‌బెల్, చెడాన్ నేషన్, చినెల్లె హెన్రీ, అలియా అలెన్, షమీలియా కానెల్, అనిసా మహ్మద్, షకేరా సెల్మాన్.