దేశంలో 40 కోట్లకు చేరిన వ్యాక్సినేషన్..

257
vaccination

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంట‌ల్లో 38,949 మందికి క‌రోనా పాజిటివ్ రాగా 542 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,10,26,829గా ఉండగా 4,30,422 యాక్టివ్ కేసులున్నాయి. కరోనాతో ఇప్పటివరకు 4,12,531 మంది ప్రాణాలు కొల్పోయారు. దేశ‌వ్యాప్తంగా మొత్తం 39,53,43,767 మందికి క‌రోనా టీకా వేయగా క‌రోనా రిక‌వ‌రీ రేటు 97.28 శాతానికి చేరుకుంది.