31 నుండి దేశవ్యాప్తంగా కోవిడ్ నిబంధనలు ఎత్తివేత..

100
covid
- Advertisement -

దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 నుండి దేశ వ్యాప్తంగా కోవిడ్ నిబంధనలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. కోవిడ్ నిబంధనలు ఎత్తివేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది.

దాదాపు రెండు సంవత్సరాల తర్వాత వైరస్ నియంత్రణకు వచ్చినందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఎత్తివేసినా ప్రజలంతా మాస్కులు, భౌతిక దూరం పాటించాలని, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తాజా ఉత్తర్వులుజారీ చేసింది కేంద్రం.

రాష్ట్రాలలో కేసులు పెరుగెతే స్థానికి ప్రభుత్వాలు నిబంధనలు విధించుకోవచ్చు అని కేంద్ర హౌం శాఖ సూచించింది. ఫేస్ మాస్క్‌ల వాడకంతో సహా కోవిడ్ నియంత్రణ చర్యలపై సలహాలు కొనసాగుతాయని నిబంధనల్లో పేర్కొంది.

- Advertisement -