97.45 శాతానికి పెరిగిన కరోనా రికవరీ రేటు..

56
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 28,204 మందికి కరోనా పాజిటివ్ సోకగా 373 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.19 కోట్లకు చేరగా 4.28 లక్షల మంది ప్రాణాలు కొల్పోయారు. ప్రస్తుతం దేశంలో 3.88 లక్షల యాక్టివ్ కేసులుండగా క్రియాశీల రేటు 1.21 శాతానికి తగ్గింది. ఇక దేశంలో రికవరీ రేటు 97.45 శాతానికి పెరగగా ఇప్పటివరకు కరోనా నుండి 3.11 కోట్ల మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 51,45,00,268 టీకాలు పంపిణీ చేశామని వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది.