సీటిమార్ రిలీజ్ డేట్ ఫిక్స్‌!

91
citimar

గోపిచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సీటిమార్. ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా పలుమార్లు రిలీజ్ డేట్ కూడా వాయిదా పడింది. అయితే తాజాగా మరోసారి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకుని థియేటర్ల ముందు సందడి చేయబోతోంది.

ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను సెప్టెంబర్ 10న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు జ్వాలా రెడ్డి , పెప్సీ ఆంటీ సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది. ఇక ఈ చిత్రం గోపీచంద్, తమన్నా ఇద్దరూ కబడ్డీ కోచ్ లుగా కనిపించనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.