విస్తరిస్తున్న కరోనా…జాగ్రత్త!

10
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రస్తుతం భారత్‌లో కొవిడ్ కేసుల సంఖ్య రెండు వేలు దాటగా గత 24 గంటల్లో సుమారు వెయ్యి మందికి పాజిటివ్‌గా తేలింది.

నిన్నటివరకు 1,828 యాక్టివ్‌ కేసులు ఉండగా.. తాజా కేసులతో కలిపి ఆ సంఖ్య 2,710కి పెరిగింది. అత్యధికంగా కేరళలో 1,147 కేసులు నమోదు కాగా ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర 424 కేసులు, ఢిల్లీ 294, గుజరాత్‌ 223, కర్ణాటక 148, తమిళనాడు 148, పశ్చిమ బెంగాల్‌ 116 కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లో 16, తెలంగాణలో 3 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వైరస్‌ వ్యాప్తితోపాటు మరణాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. గత 24 గంటల వ్యవధిలో ఏడు మరణాలు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

Also Read:వెదర్ అప్‌డేట్…టుడే

- Advertisement -