దేశాన్ని మళ్లీ కరోనా భయపెడుతోంది. కొత్తగా 257 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది కేంద్రం. అయితే, కొన్ని వారాలుగా సింగపూర్, హాంకాంగ్‌లో కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.
కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో కొవిడ్ కొత్త కేసులు నమోదు అవుతున్నాయి అని అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం కొవిడ్ కేసులపై దృష్టి సారించింది. దేశ జనాభాను పరిగణనలోకి తీసుకుంటే కోవిడ్ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
ప్రస్తుతం ఉన్న కేసులన్నీ దాదాపుగా తేలికపాటివి, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP), ICMR ద్వారా దేశంలో COVID-19 సహా శ్వాసకోశ వైరల్ వ్యాధుల పర్యవేక్షణకు బలమైన వ్యవస్థ కూడా ఉందని నిపుణులు చెప్పారు. కోవిడ్-19 JN 1 వేరియంట్ కారణంగా రోగులకు జ్వరం, అలసట, తలనొప్పి గొంతు నొప్పి ఉన్నట్లు గుర్తించిన ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.
Also Read:పుత్రోత్సాహంలో ఎమ్మెల్సీ కవిత

