లేఆఫ్స్‌.. తగ్గిన H1-B అప్లికేషన్స్!

10
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో H1-B వీసా దరఖాస్తులు 25% తగ్గిపోయాయి. 2026 ఆర్థిక సంవత్సరం కోసం H1-B వీసా దరఖాస్తులు 25% తగ్గి 3,58,737 మాత్రమే నమోదయ్యాయి. గత సంవత్సరంతో పోల్చితే ఇది భారీ తగ్గుదల.

దీనికి ప్రధాన కారణం.. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల తొలగింపులు, ఆర్థిక అనిశ్చితి మరియు పెరిగిన దరఖాస్తు ఫీజు. మొత్తం దరఖాస్తులలో 120,141 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇది గత ఏడాది ఎంపికైన 135,137 మంది కంటే తక్కువ.

యూఎస్ ప్రభుత్వం ప్రతీ ఏడాది 85,000 H1-B వీసాలు జారీ చేస్తుంది. H1-B వీసాదారుల్లో ఎక్కువ శాతం భారతీయులు ఉంటారు. 2022లో మంజూరైన 3.2 లక్షల H1-B వీసాలలో 77% భారతీయులకే వచ్చాయి. 2023లో కూడా 3.86 లక్షల వీసాల్లో 72.3% భారతీయులదే. బైడెన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఫీజు విధానం ప్రకారం, H1-B వీసా దరఖాస్తు ఫీజు $10 నుంచి $215 కి పెరిగింది. దీని ప్రభావంతోనే దరఖాస్తుల సంఖ్య తగ్గినట్టు చెప్పవచ్చు.

H1-B వీసా అనేది ఒక నాన్-ఇమ్మిగ్రంట్ వీసా. ఇది అమెరికా కంపెనీలకు విదేశీ నిపుణులను తాత్కాలికంగా నియమించుకునే అవకాశం ఇస్తుంది. ఈ వీసా స్పెషలైజ్డ్ జాబ్స్ కోసం మాత్రమే ఉంటుంది . వీటికి సాధారణంగా బ్యాచిలర్ డిగ్రీ లేదా సమానమైన అర్హత అవసరం. ముఖ్యంగా ఐటీ కంపెనీలు ఈ వీసాలను ఎక్కువగా వాడతాయి.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగం సంక్షోభంలో చిక్కుకోగా కంపెనీలు భారాన్ని తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ ఇటీవల 6,000 ఉద్యోగులను తొలగించగా 2023 తరువాత ఆ సంస్థలో జరిగిన అతి పెద్ద ఉద్యోగాల తొలగింపు ఇదే.

Also Read:Covid:దేశంలో మళ్లీ కరోనా కలకలం..

- Advertisement -