దేశంలో గణనీయంగా తగ్గుతున్న కరోనా..

125
Covid
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో దేశంలో 13,405 కరోనా కేసులు నమోదుకాగా 235 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,28,51,929కి చేరగా 4,21,58,510 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు.

కరోనాతో ఇప్పటివరకు 5,12,344 మంది మృతిచెందారు. దేశంలో ప్రస్తుతం 1,81,075 కేసులు యాక్టివ్‌గా ఉండగా పాజిటివిటీ రేటు కూడా 1.24 శాతానికి పడిపోయింది. ఇప్పటివరకు దేశంలో 1,75,83,27,441 మందికి వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు.

- Advertisement -