దేశంలో కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటింది. సింగపూర్, హాంకాంగ్, చైనాలో కొత్త వేరియంట్లు వ్యాప్తి చెందుతుండగా భారత్‌లో సైతం కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 100 కేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 1,009కి చేరింది. కరోనాతో మహారాష్ట్రలో నలుగురు, కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు మరణించారు.
430 కేసులతో అగ్రస్థానంలో ఉండగా తర్వాతి మహారాష్ట్ర (209 కేసులు), ఢిల్లీ ( 104 కేసులు), గుజరాత్ (83 కేసులు), కర్ణాటక (47 కేసులు), ఉత్తరప్రదేశ్ (15 కేసుల), పశ్చిమ్ బెంగాల్ (12 కేసులు)లో ఎక్కువ కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర థానే ఛత్రపతి శివాజీ మహారాజ్ కల్వా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 21 ఏళ్ల యువకుడు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయి.. చికిత్స పొందుతూ మృతిచెందాడు.
ప్రస్తుతం కరోనా కేసులకు జేఎన్ 1 వేరియంట్ కారణమని భావిస్తున్నారు. ఇదివరకు వచ్చిన వేరియంట్ల కంటే ఇది వేగంగా వ్యాప్తి చెందుతుంది. చాలా మందిలో తేలికపాటి లక్షణాలే ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Also Read:హరిహర వీరమల్లు..లిరికల్ అప్‌డేట్!

