- Advertisement -
ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, మరో ముగ్గురు బెయిల్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేసింది సీబీఐ. నలుగురికి బెయిల్ ఇవ్వద్దంటూ కౌంటర్లో పేర్కొంది సీబీఐ. ఓఎంసీ కేసులో సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నలుగురి పిటిషన్లు దాకలు చేసిన సంగతి తెలిసిందే.
హైకోర్టులో గాలి, పీవీ శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, అలీఖాన్ పిటిషన్లు దాఖలు చేశారు. ఓబులాపురం మైనింగ్ కేసులో నలుగురిని దోషులుగా చేర్చింది సీబీఐ కోర్టు. సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తప్పు పట్టారు పిటిషనర్లు. సీబీఐ కోర్టు యాంత్రికంగా తీర్పు వెలువరించిందని న్యాయస్థానానికి తెలపగా నలుగురు దోషుల పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసింది సీబీఐ. ప్రస్తుతం నలుగురు చంచల్‌గూడ జైలులో ఉన్నారు.
Also Read:హరిహర వీరమల్లు..లిరికల్ అప్‌డేట్!
- Advertisement -

