బలహీన పడుతున్న కరోనా సెకండ్ వేవ్..!

85
covid

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాలుస్తున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ ధాటికి రోజుకు రికార్డు స్ధాయిలో కేసులు నమోదవుతుండగా వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడుతున్నారు. కరోనాకు తోడు ఆక్సిజన్‌ అందుబాటులోకి లేకపోవడంతో ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ కీలక విషయాలను వెల్లడించింది. దేశంలో కరోనా కేసులు, మరణాల రేటు క్రమంగా క్షీణిస్తోందని…మే చివరినాటికి సెకండ్ వేవ్ బలహీన పడుతుందని అంచనా వేసింది.

ఒకవేళ కరోనా థర్డ్ వేవ్ వస్తే అది చిన్నారులపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని… 80 శాతానికి పెరుగుతుందని అంచనా వేశారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా 18 రాష్ట్రాల్లో కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపింది. 26 రాష్ట్రాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు సుమారు 15 శాతంగా ఉందని వెల్లడించింది.