కరోనా నుండి కోలుకున్న బన్నీ..

61
allu

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలె కరోనా బారీన సంగతి తెలిసిందే. కొద్దిపాటి లక్షణాలతో కరోనా బారిన పడిన అల్లు అర్జున్…మహమ్మారిని జయించారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు బ‌న్నీ. 15 రోజులు క్వారంటైన్ త‌ర్వాత నాకు నెగెటివ్ అని నిర్దారణ అయింది. నేను కోలుకోవాల‌ని ప్రార్ధించిన స్నేహితులు, అభిమానులు, శ్రేయోభిలాషులు అంద‌రికి ధ‌న్య‌వాదాలు. లాక్‌డౌన్ వ‌ల‌న కొద్దిగా కేసులు త‌గ్గే అవ‌కాశం ఉంది. అంద‌రు ఇంటి ప‌ట్టున క్షేమంగా ఉండండి. మీ ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు అని వెల్లడించారు బన్నీ. ప్ర‌స్తుతం బ‌న్నీ పుష్ప సినిమాతో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే.