- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. గత 24 గంటల్లో 59,118 కరోనా కేసులు నమోదుకాగా 257 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,18,46,652కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,21,066 యాక్టివ్ కేసులుండగా 1,12,64,637 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
కరోనాతో ఇప్పటివరకు 1,60,949 మంది మృతిచెందగా ఇప్పటి వరకు మొత్తం 5,55,04,440 మందికి కరోనా టీకా అందించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
- Advertisement -