భారత్‌లో 14,792 కరోనా కేసులు..

234
love agarwal
- Advertisement -

కరోనా మహమ్మారి రోజురోజుకి విస్తరిస్తూనే ఉంది. ఇప్పటివరకు దేశంలో 14,792 కేసులు నమోదు కాగా 488 మంది చనిపోయారు. గత 24 గంటల వ్యవధిలో 957 కొత్త కేసులు నమోదు కాగా, 36 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

మ‌ర్క‌జ్‌తో లింకున్న కేసులు 23 రాష్ట్రాల్లో బ‌య‌ట‌ప‌డిన‌ట్లు చెప్పారు. త‌మిళ‌నాడులో 84 శాతం, ఢిల్లీలో 63 శాతం, తెలంగాణ‌లో 79 శాతం, యూపీలో 59 శాతం, ఏపీలో 61 శాతం కేసుల‌న్నీ మ‌ర్క‌జ్‌తో లింకున్న‌వే అని అన్నారు.

మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వ‌య‌సుల వారిగా మ‌ర‌ణాల రేటును ఆయ‌న తెలిపారు.

23 రాష్ట్రాల్లో ఉన్న 47 జిల్లాల్లో పాజిటివ్ ట్రెండ్ ఉన్న‌ట్లు అగ‌ర్వాల్ తెలిపారు.మ‌రో 45 జిల్లాల్లో గ‌త 14 రోజుల్లో కొత్త కేసు న‌మోదు కాలేద‌న్నారు. మొత్తం 14,378 కేసుల్లో.. మర్క‌జ్‌కు సంబంధించి 4291 కేసులు ఉన్న‌ట్లు అగ‌ర్వాల్ తెలిపారు.

- Advertisement -