దేశంలో 24 గంటల్లో 31,118 కరోనా కేసులు..

77
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 95 లక్షలకు చేరువయ్యాయి. గత 24గంటల్లో 31,118 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 482 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 94.62లక్షలకు చేరువయ్యాయి.

ప్రస్తుతం 4,35,603 యాక్టివ్ కేసులుండగా ఇప్పటివరకు కరోనాతో 88,89,585 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 1,37,621 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 41,985 మంది కరోనా నుండి కోలుకున్నారు.