దేశంలో 81 లక్షలకు చేరువలో కరోనా కేసులు…

110
covid 19

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 81 లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 48,648 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 563 మంది మృతి చెందారు. ఇక దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 80,88,851కి చేరింది.

ప్రస్తుతం దేశంలో 5,94,386 యాక్టివ్ కేసులుండగా 73,73,375 మంది కరోనా నుండి కోలుకున్నారు. క‌రోనా మృతుల సంఖ్య 1,21,090కు చేరింది.

దేశంలో గత 24 గంటల్లో 11,64,648 టెస్టులు నిర్వహించగా ఇప్పటివరకు 10,77,28,088 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎమ్మార్‌) తెలిపింది.