దేశంలో 78 లక్షలకు చేరువలో కరోనా కేసులు…

86
coronavirus

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. గత 24 గంట‌ల్లో 54,366 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 690 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77,61,312కు చేరాయి.

ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 6,95,509గా ఉండగా 1,17,306 మంది ప్రాణాలు కొల్పోయారు. కరోనా మహమ్మారి నుండి 69,48,497 మంది కోలుకోగా గ‌త 24 గంట‌ల్లో 73,979 మంది డిశ్చార్జ్ అయ్యారు.