దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత 24 గంటల్లో
దేశంలో 11,458 కేసులు నమోదు కాగా,386 మంది మృత్యువాత పడ్డారు.
ఇక దేశంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 3,08,993గా ఉండగా యాక్టివ్ కేసులు 1,45,779 ఉన్నాయి. 1,54,329 మంది కోలుకొని డిశ్చార్జి కాగా 8,884 మంది మృతిచెందారు.
ఇక మహారాష్ట్రలో అత్యధికంగా లక్ష కేసులు నమోదుకాగా 3717 మంది చనిపోయారు. రాష్ట్రాల వారీగా వివరాలను పరిశీలిస్తే తమిళనాడులో 40,698 పాజిటివ్ కేసులు, 367 మంది మృతి చెందారు. ఢిల్లీలో 36,824 కరోనా కేసులు నమోదుకాగా 1,214 మంది మృతిచెందారు.
గుజరాత్‌లో 22,562 పాజిటివ్ కేసులు, 1,416 మంది మృతిచెందగా ఉత్తరప్రదేశ్‌లో 12,616 పాజిటివ్ కేసులు, 365 మంది మృతి,రాజస్థాన్‌లో 12,068 పాజిటివ్ కేసులు, 272 మంది మృతి,మధ్యప్రదేశ్‌లో 10,443 పాజిటివ్ కేసులు, 440 మంది మృతి చెందారు.కేరళలో 2,323 పాజిటివ్ కేసులు, 20 మంది మృత్యువాత పడ్డారు.