కేసులో 4వ స్ధానం..మరణాల్లో 9వ స్ధానం

210
coronavirus
- Advertisement -

భారత్ లో కరోనా వైరస్ తీవ్రరూపం దాలుస్తోంది… రోజురోజుకి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే వుంది.. కరోనా కేసుల్లో భారత్ నాల్గో స్థానానికి దూసుకుపోగా…9520 మరణాలతో ప్రపంచ జాబితాలో భారత్‌ 9వ స్థానానికి చేరింది. అత్యధిక కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా… ఆ తర్వాత బ్రెజిల్, రష్యా…. భారత్ కంటే ముందున్నాయి.

గత 24 గంటల్లో కొత్తగా 11,502 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 325 మంది మృతిచెందగా ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,32,424కి పెరిగింది. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 1,53,106 యాక్టివ్‌ కేసులు ఉండగా, 1,69,798 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 9520 మంది మరణించారు.

దేశంలో అత్యధిక కేసులు నమోదైన మహారాష్ట్రలో మొత్తం కరోనా పాజిటివ్‌ల సంఖ్య 1,07,958కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ వైరస్‌ వల్ల 3950 మంది మరణించారు.దేశంలో కరోనా రికవరీ రేటు 50 శాతం దాటినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కరోనా బారినపడిన వారిలో 50.59 శాతం మంది కోలుకున్నారని, కరోనా బాధితులకంటే కోలుకున్న వారిసంఖ్య 13,031 అధికంగా ఉన్నదని తెలిపింది.

- Advertisement -