- Advertisement -
దేశంలో రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటలలో దేశంలో కొత్తగా 9971 పాజిటివ్ కేసులు నమోదుకాగా కరోనా కేసుల సంఖ్య 246628 కి చేరాయి.
24 గంటల్లో కరోనాతో 287 మంది మరణించగా ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 120406 ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 6929 మంది మృతిచెందగా 119293 మంది కోలుకున్నారు.
ప్రపంచవ్యాప్త కరోనా పాజిటివ్ కేసులు 70 లక్షలకు చేరువయ్యాయి. 213 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించగా యాక్టివ్ కేసుల సంఖ్య 31 లక్షల 61 వేల 346గా ఉన్నాయి. ఇప్పటివరకు 4 లక్షల 2 వేల 94 మంది చనిపోగా వ్యాధి నుంచి 34 లక్షల 11 వేల 281 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
యూఎస్‌ఏలో కొత్తగా 20,900 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా బాధితుల సంఖ్య 19.88 లక్షలు దాటింది. వ్యాధి కారణంగా అమెరికాలో ఇప్పటివరకు ఒక లక్షా 12 వేల 96 మంది చనిపోయారు.
- Advertisement -