- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో దేశంలో 28,903 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 188 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,14,38,734కు చేరింది.
దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,34,406గా ఉండగా ఇప్పటి వరకు 1,10,45,284 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కరోనాతో ఇప్పటివరకు 1,59,044 మంది మృతిచెందారు. టీకా డ్రైవ్లో భాగంగా ఇప్పటి వరకు 3,50,64,536 డోసులు వేసినట్లు వైద్య,ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 22.92లక్షల టెస్టులు నిర్వహించినట్లు వెల్లడించింది.
- Advertisement -