దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా…

59
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోంది. గత కొద్దిరోజులుగా 15 వేల లోపే నమోదవుతూ వస్తున్న కరోనా కేసుల సంఖ్య 24 గంటల్లో పెరిగింది. 16,738 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 138 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,10,46,914కు చేరింది.

ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,51,708గా ఉండగా 1,07,38,501 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 1,56,705 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 21,38,29,658 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.