229 మంది విద్యార్థులకు కరోనా…

113
maharashtra
- Advertisement -

దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. మహారాష్ట్ర,కేరళ లాంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండటం అందరిని ఆందోళనకు గురిచేస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో పలు చోట్ల నైట్ కర్ఫ్యూ విధించగా తాజాగా వాషిమ్‌ జిల్లాలోని ఓ స్కూల్ హాస్ట‌ల్‌లో ఏకంగా 229మంది విద్యార్థులు క‌రోనా బారిన ప‌డ్డారు.

దీంతో స్కూల్ ప‌రిస‌రాల‌ను కంటైన్మెంట్ జోన్‌గా ప్ర‌క‌టించారు. ఈ విద్యార్థులలో చాలా వ‌ర‌కు క‌రోనా తీవ్రత ఎక్కువ‌గా ఉన్న అమ‌రావ‌తి, య‌వ‌త్మ‌ల్ జిల్లాల‌కు చెందిన వాళ్లే కావ‌డం గ‌మ‌నార్హం.

మహారాష్ట్రలో గత 24 గంట‌ల్లోనే మ‌హారాష్ట్ర‌లో మొత్తం 8 వేల కేసులు న‌మోదుకాగా ప్రజలు కరోనా నిబంధనలు పాటించని పక్షంలో కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది ఠాక్రే సర్కార్. ఇక టీకా డ్రైవ్‌లో భాగంగా అత్యధికంగా మహారాష్ట్రలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగిన కేసులు పెరుగుతుండటం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

- Advertisement -