దేశంలో 76 లక్షలు దాటిన కరోనా కేసులు…

89
corona

దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 54,044 కేసులు న‌మోదు కాగా 717 మంది మృతిచెందారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 76,51,108కి చేరుకున్నాయి.

ప్రస్తుతం దేశంలో 7,40,090 యాక్టివ్ కేసులుండగా 1,15,914 మంది మృతిచెందారు. 67,95,103 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. గ‌త 24 గంటల్లో 61,775 మంది డిశ్చార్జ్ కాగా కరోనా టెస్టుల సంఖ్య 10 కోట్లకు చేరుకుంది.